
Security risk: బిగ్ అలర్ట్.. మీ ఫోన్‌ను త్వరగా అప్‌డేట్ చేయండి.. లేదంటే, పెద్ద ప్రమాదమే!
Play all audios:
జనవరి 11న CERT-In ప్రచురించిన నోట్ ప్రకారం, ఆపరేటింగ్ సిస్టమ్‌లోని వివిధ లోపాల కారణంగా ఆండ్రాయిడ్‌లో ఈ వల్నరబిలిటీలు తలెత్తాయి. ఈ భాగాలలో ఫ్రేమ్‌వర్క్, సిస్టమ్, గూగుల్ ప్లే సిస్టమ్
అప్‌డేట్లు, ఆర్మ్ కాంపోనెంట్లు, ఇమాజినేషన్ టెక్నాలజీస్, మీడియాటెక్ కాంపోనెంట్లు, యూనిసోక్ కాంపోనెంట్లు, క్వాల్‌కామ్ కాంపోనెంట్లు, దాని క్లోజ్డ్ సోర్స్ వంటివి ఉన్నాయి. * ఆండ్రాయిడ్ యూజర్లు
అందరికీ రిస్క్ ఈ వల్నరబిలిటీస్ ఫోన్ బ్రాండ్ లేదా మోడల్‌తో సంబంధం లేకుండా దేశంలోని దాదాపు ప్రతి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్‌పై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. బేసిక్ ఆండ్రాయిడ్ ఫోన్లు,
ప్రీమియం శామ్‌సంగ్, గూగుల్ ఫోన్ల యూజర్లు కూడా ఈ సమస్యల వల్ల ప్రమాదంలో పడ్డారు. ఈ ప్రాబ్లమ్స్ ఓల్డ్ ఆండ్రాయిడ్ వెర్షన్‌లను మాత్రమే కాకుండా ఆండ్రాయిడ్ 11, 12, 12L, 13, 14 వంటి కొత్త వాటిని
కూడా ప్రభావితం చేస్తాయి. ఈ సమస్యలు డివైజ్ పర్ఫామెన్స్, సెక్యూరిటీని దెబ్బతీస్తాయి, హ్యాకర్లకు రిమోట్ యాక్సెస్‌ను అందిస్తాయి. advertisement గూగుల్ ఈ హై రిస్క్ వల్నరబిలిటీలను గుర్తించింది.
దీంతో ఆండ్రాయిడ్ యూజర్లందరికీ సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను విడుదల చేస్తోంది. ఈ అప్‌డేట్లు వల్నరబిలిటీలు సరిచేస్తాయి, లేటెస్ట్ ప్యాచ్‌తో డివైజ్‌లను ప్రొటెక్ట్ చేస్తాయి. * అప్‌డేట్ చేయాలి.. ఈ
సమస్యల నుంచి డివైజ్‌లను రక్షించుకోవడానికి, ఆండ్రాయిడ్ యూజర్లు ఆపరేటింగ్ సిస్టమ్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేయాలి. ఫోన్‌లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి, ఆండ్రాయిడ్ వెర్షన్‌పై నొక్కాలి.
కొన్ని ఫోన్లలో "అబౌట్ ఫోన్" సెక్షన్‌లో " సాఫ్ట్‌వేర్ ఇన్ఫర్మేషన్" ఆప్షన్‌పై క్లిక్ చేసి ఆండ్రాయిడ్ వెర్షన్ ఏంటనే వివరాలు తెలుసుకోవచ్చు. "సిస్టమ్ అండ్
అప్‌డేట్స్"లో "సెక్యూరిటీ"పై క్లిక్ చేసి, కొత్త అప్‌డేట్స్ కోసం చెక్ చేయాలి. advertisement కొత్త సాఫ్ట్‌వేర్ ఆప్షన్ ఉంటే, దాన్ని డివైజ్‌లో ఇన్‌స్టాల్ చేసి, ఫోన్‌ను
రీస్టార్ట్ చేయాలి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసేటప్పుడు ఛార్జింగ్ కనీసం 50% పైగా ఉండేలా చూసుకోవాలి. కొన్ని మొబైల్స్‌లో "సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్" ఆప్షన్‌పై నొక్కి నేరుగా కొత్త అప్‌డేట్
అవైలబుల్‌లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవచ్చు. అందుబాటులో ఉంటే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. Location : Hyderabad,Telangana Vijayawada,Krishna,Andhra Pradesh First Published : January 16, 2024 12:38
PM IST