Digestive problems: తిన్న ఆహారం తొందరగా అరగట్లేదా? ఏదో సమస్యగా అనిపిస్తోందా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

Digestive problems: తిన్న ఆహారం తొందరగా అరగట్లేదా? ఏదో సమస్యగా అనిపిస్తోందా? అయితే ఈ చిట్కాలు మీ కోసమే..

Play all audios:

Loading...

Published by: Last Updated:April 22, 2022 2:06 PM IST మనం తీసుకునే ఆహారం(FOOD), మన జీవన విధానం బట్టి మన ఆరోగ్యం(HEALTH) ఉంటుంది. గ్యాస్, ఎసిడిటీ, బ్లోటింగ్ లాంటివి ఎక్కువవుతున్నాయి. తిన్న


ఆహారం తొందరగా అరగకపోతే ఈ చిట్కాలు ప్రయత్నిస్తే బెటర్​. ప్రస్తుతం చాలామంది బద్దకపు జీవనశైలిని పాటిస్తున్నారు. ఎటూ కదలకుండా రోజంతా ఒకే దగ్గర కూర్చొని ఉంటే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం


ఉంది. ముఖ్యంగా అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. కొందరు ఆలస్యంగా పడుకోవడం, జంక్ ఫుడ్ విపరీతంగా ఆరగించడం వంటివి చేస్తుంటారు. అటువంటి వారిలో ఎక్కువగా ఛాతీలో మంట, కడుపునొప్పి(Abdominal pain),


మలబద్ధకం, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధ సమస్యలు(Digestive Problems) వస్తాయి. అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల జీర్ణ విషతుల్యాలు (Digestive Toxins) కూడా పెరిగిపోతాయి. వీటిపై అవగాహన పెంచుకోవాలని


సూచిస్తున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఈ టాక్సిన్‌లు జీవక్రియతో పాటు మొత్తం ఆరోగ్యంపై చెడు ప్రభావం కలిగిస్తాయని వివరిస్తున్నారు. సరైన సమయానికి తినకపోవడంతో జీర్ణ సమస్యలు(digestive problems)


ఎదుర్కొంటున్నాడు. మనం తీసుకునే ఆహారం(food), మన జీవన విధానం బట్టి మన ఆరోగ్యం(health) ఉంటుంది. ఈ క్ర‌మంలోనే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగుప‌రుచుకునేందుకు కొన్ని ఆహారాల‌ను కొద్ది రోజుల పాటు


తీసుకోవాలి. దీంతో జీర్ణం బాగా అవ‌డ‌మే కాదు, ఆయా జీర్ణ స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి. ఆ పదార్థాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.. భోజనం మానేయడం, ఆకలి లేకపోయినా తినడం, ఒకేసారి అధిక మోతాదులో తినడం


వంటివి చేయకూడదు. వేళాపాళా లేకుండా తినడం, నిద్రపోయే ముందు తినడం వంటివి కూడా మన జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. advertisement సలైవాలో వుండే ఎంజైమ్స్ జీర్ణ ప్రక్రియ మొదలు పెడతాయి. అయితే చాలా మంది


వేగంగా నమలకుండా తినేస్తుంటారు. అలా కాకుండా నెమ్మదిగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. చద్దన్నం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది గ్యాస్టిక్, ఎసిడిటి మరియు కాన్స్టిపేషన్ సమస్యలను దూరం


చేస్తుంది కాబట్టి ఉదయాన్నే చద్దన్నం తినడం మంచిది. ఆపిల్ సైడర్ వెనిగర్ కాన్స్టిపేషన్ ,  గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేస్తుంది. భోజనం చేసిన తర్వాత జీలకర్ర తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్, ఎసిడిటి


సమస్యలు ఉండవు. ప్రతి రోజు కూడా ఆహారాన్ని సరైన సమయానికి తినాలి. చాలా మంది తినకుండా స్కిప్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. అదే విధంగా ఒత్తిడి, నిద్ర కూడా ఆరోగ్యంపై ప్రభావం


చూపిస్తుందని గమనించండి. advertisement యాపిల్(Apple) పండ్ల‌లో పుష్క‌లంగా ఉండే పెక్టిన్ జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌య్యేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. క‌నుక నిత్యం


యాపిల్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.  సోంపు గింజ‌ల్లో ఉండే ఫైబ‌ర్ జీర్ణాశ‌యంలో ఆహారం క‌ద‌లిక‌ను స‌రిచేస్తుంది. దీంతో క‌డుపు నొప్పి(stomach pain), అజీర్ణం,


గ్యాస్ రాకుండా ఉంటాయి. తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది. (Disclaimer: The information and information provided in this article is based on general information. Telugu News 18 does not


confirm these. Please contact the relevant expert before implementing them.) Location : First Published : April 22, 2022 1:47 PM IST Read More