Imran khan: మునీర్‌ను isi చీఫ్‌ పదవి నుంచి తప్పిస్తే.. నా భార్యపై కక్షగట్టాడు - ఇమ్రాన్‌ ఖాన్‌

Imran khan: మునీర్‌ను isi చీఫ్‌ పదవి నుంచి తప్పిస్తే.. నా భార్యపై కక్షగట్టాడు - ఇమ్రాన్‌ ఖాన్‌

Play all audios:

Loading...

మునీర్‌ను ఐఎస్‌ఐ చీఫ్‌ బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత తన భార్య బుష్రా బీబీని లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురిచేశాడని పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు. ఇంటర్నెట్‌ డెస్క్‌:


పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఆసిం మునీర్‌పై మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan) సంచలన వ్యాఖ్యలు చేశారు. మునీర్‌కు ప్రతీకార స్వభావం ఉందని, ఆయన్ను ఐఎస్‌ఐ చీఫ్‌ బాధ్యతల నుంచి తప్పించిన


తర్వాత తన భార్య బుష్రా బీబీని లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురిచేశాడని అన్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌.. తన కుటుంబంతోపాటు పార్టీ కార్యకర్తలను కూడా అన్యాయంగా జైల్లో


పెడుతున్నారని వాపోయారు. ‘‘ప్రధాని హోదాలో ఐఎస్‌ఐ డీజీ పదవి నుంచి జనరల్‌ మునీర్‌ను తొలగించాను. ఇదే విషయంపై మాట్లాడేందుకు నా భార్య బుష్రా బీబీని సంప్రదించేందుకు మధ్యవర్తుల ద్వారా ఆయన ప్రయత్నాలు


చేశాడు. అటువంటి వాటిలో జోక్యం చేసుకోనని, తనను సంప్రదించవద్దని నా భార్య కరాఖండీగా పేర్కొంది. దాంతో ఆమెకు అన్యాయంగా 14నెలల శిక్ష విధించి, జైల్లోనూ అమానవీయంగా ప్రవర్తించాడు. దాని వెనక ఆసిమ్‌


మునీర్‌ ప్రతీకార స్వభావం స్పష్టంగా కనిపిస్తోంది’’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ పేర్కొన్నారు. * పాక్‌లో భూకంపం అలజడి... అదే అదునుగా 216 మంది ఖైదీల పరార్‌ వ్యక్తిగత ప్రతీకారం కోసం తన భార్యను లక్ష్యంగా


చేసుకున్న తీరు ఉహించనిదని.. పాక్‌ నియంతృత్వ చీకటి రోజుల్లోనూ అలా జరగలేదని (Pakistan) మాజీ ప్రధాని పేర్కొన్నారు. రాజకీయాలకు సంబంధం లేని ఆమెపై అనేక కేసులు పెట్టారని, నెల రోజులుగా ఆమెతో భేటీ


కూడా కావనివ్వడం లేదన్నారు. ‘లండన్‌ ప్లాన్‌’లో భాగంగానే మే 9, 2023న (ఇమ్రాన్‌ను అరెస్టు చేసిన రోజు చెలరేగిన హింస) ఘటన చోటుచేసుకుందని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించారు.