
Today horoscope in telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.... (14/05/2025)
Play all audios:
మేషం అవరోధాలు ఉన్నాయి. ఓర్పుతో ముందుకు సాగాలి. మాట పట్టింపులకు పోకండి. మొహమాటం వల్ల లేనిపోని సమస్యలు తెచ్చుకోకండి. ఎవరినీ అతిగా నమ్మకండి. శ్రీసుబ్రహ్మణ్యస్వామి స్తోత్రం చదివితే మంచిది.
అశ్విని నక్షత్ర జాతకులకు రోజంతా శుభ తారాబలం ఉంది. భరణి నక్షత్ర జాతకులకు నైధన తార - చాలా చెడ్డది (మ.12 వరకు), ఆ తర్వాత మిత్ర తార - మంచిది. కృత్తిక నక్షత్ర జాతకులకు సాధక తార - చాలా మంచిది
(మ.12 వరకు), ఆ తర్వాత నైధన తార - చాలా చెడ్డది. వృషభం సంతోషకరమైన వార్తలను వింటారు. శరీర సౌఖ్యం ఉంది. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. భోజనసౌఖ్యం ఉంది. శ్రీఆంజనేయ ఆరాధన శుభప్రదం. కృత్తిక
నక్షత్ర జాతకులకు సాధక తార - చాలా మంచిది (మ.12 వరకు), ఆ తర్వాత నైధన తార - చాలా చెడ్డది. రోహిణి నక్షత్ర జాతకులకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు (మ.12 వరకు), ఆ తర్వాత సాధక తార - చాలా మంచిది.
మిథునం ఆనందాన్నిచ్చే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగులకు అనుకూల కాలం. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బుద్దిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి నుంచి ప్రశంసలను
అందుకుంటారు. ఇష్టదేవతారాధన శుభప్రదం. మృగశిర నక్షత్ర జాతకులకు క్షేమ తార - మంచిది (మ.12 వరకు), ఆ తర్వాత ప్రత్యారి తార - అంత మంచిది కాదు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు విపత్తార - చెడ్డది (మ.12
వరకు), ఆ తర్వాత క్షేమ తార - మంచిది. కర్కాటకం చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు.
శ్రీఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం. పునర్వసు నక్షత్ర జాతకులకు సంపత్తార - చాలా మంచిది (మ.12 వరకు), ఆ తర్వాత విపత్తార - చెడ్డది. పుష్యమి నక్షత్ర జాతకులకు జన్మ తార - అంత మంచిది కాదు (మ.12
వరకు), ఆ తర్వాత సంపత్తార - చాలా మంచిది. సింహం మధ్యమ ఫలితాలు ఉన్నాయి. మీ రంగాల్లో ఓర్పు,సహనం,పట్టుదల అవసరం. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనవసరమైన ఆలోచనలతో కాలాన్ని వృథా చేయకండి.
ఇష్టదేవతా ఆరాధన శక్తిని ఇస్తుంది. మఖ నక్షత్ర జాతకులకు రోజంతా శుభ తారాబలం ఉంది. పుబ్బ నక్షత్ర జాతకులకు నైధన తార - చాలా చెడ్డది (మ.12 వరకు), ఆ తర్వాత మిత్ర తార - మంచిది. కన్య బాధ్యతలు
పెరుగుతాయి. ధర్మసిద్ధి ఉంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. దుర్గాదేవి ఆరాధన
శక్తిని ఇస్తుంది. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు సాధక తార - చాలా మంచిది (మ.12 వరకు), ఆ తర్వాత నైధన తార - చాలా చెడ్డది. హస్త నక్షత్ర జాతకులకు ప్రత్యారి తార - అంత మంచిది కాదు (మ.12 వరకు), ఆ
తర్వాత సాధక తార - చాలా మంచిది. తుల తోటివారి సహకారంతో ముందుకు సాగండి,మంచి జరుగుతుంది. సంపూర్ణ అవగాహనతో ముందుకు సాగి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన
మంచి ఫలితాలను ఇస్తుంది. చిత్త నక్షత్ర జాతకులకు క్షేమ తార - మంచిది (మ.12 వరకు), ఆ తర్వాత ప్రత్యారి తార - అంత మంచిది కాదు. స్వాతి నక్షత్ర జాతకులకు విపత్తార - చెడ్డది (మ.12 వరకు), ఆ తర్వాత
క్షేమ తార - మంచిది. వృశ్చికం అత్యంత శ్రేష్టమైన శుభ కాలం నడుస్తోంది. ఉత్సాహవంతమైన కాలాన్ని గడుపుతారు. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ నామాన్ని
జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. విశాఖ నక్షత్ర జాతకులకు సంపత్తార - చాలా మంచిది (మ.12 వరకు), ఆ తర్వాత విపత్తార - చెడ్డది. అనురాధ నక్షత్ర జాతకులకు జన్మ తార - అంత మంచిది కాదు (మ.12
వరకు), ఆ తర్వాత సంపత్తార - చాలా మంచిది. ధనుస్సు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది. ఒక శుభవార్త మీ
ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. శివుడిని ఆరాధిస్తే మంచిది. మూల నక్షత్ర జాతకులకు రోజంతా శుభ తారాబలం ఉంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు నైధన తార - చాలా చెడ్డది (మ.12
వరకు), ఆ తర్వాత మిత్ర తార - మంచిది. మకరం బుద్ధిబలం బాగుంటుంది. బంధు, మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు
లభిస్తాయి. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు సాధక తార - చాలా మంచిది (మ.12 వరకు), ఆ తర్వాత నైధన తార - చాలా చెడ్డది; శ్రవణం నక్షత్ర జాతకులకు ప్రత్యారి తార - అంత మంచిది
కాదు (మ.12 వరకు), ఆ తర్వాత సాధక తార - చాలా మంచిది. కుంభం మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. చేసేపనిలో స్పష్టత పెరుగుతుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయాన్ని
సద్వినియోగం చేసుకోండి. ఇష్టదేవతా ఆరాధన శుభప్రదం. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు క్షేమ తార - మంచిది (మ.12 వరకు), ఆ తర్వాత ప్రత్యారి తార - అంత మంచిది కాదు. శతభిషం నక్షత్ర జాతకులకు విపత్తార - చెడ్డది
(మ.12 వరకు), ఆ తర్వాత క్షేమ తార - మంచిది. మీనం చిత్తశుద్ధితో చేసే పనుల వల్ల అంతా మంచి జరుగుతుంది. చంచల నిర్ణయాలు ఇబ్బందిపెడతాయి. మనోధైర్యాన్ని కోల్పోరాదు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర
విషయాలతో సమయాన్ని వృథా కానీయకండి. నవగ్రహ ధ్యానం శుభకరం. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు సంపత్తార - చాలా మంచిది (మ.12 వరకు), ఆ తర్వాత విపత్తార - చెడ్డది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు జన్మ తార -
అంత మంచిది కాదు (మ.12 వరకు), ఆ తర్వాత సంపత్తార - చాలా మంచిది; రేవతి నక్షత్ర జాతకులకు పరమ మిత్ర తార - మంచిది (మ.12 వరకు), ఆ తర్వాత జన్మ తార - అంత మంచిది కాదు. _- ఇంటర్నెట్ డెస్క్_